: కాసేపట్లో ఉమాభారతిని కలవనున్న కేసీఆర్


కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో భేటీకానున్నారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా, ప్రాజెక్టు డిజైన్ లో జరుపుతున్న మార్పుల గురించి ఆమెకు వివరించనున్నారు. అంతేకాకుండా, నాలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న కృష్ణా నది జలాల వివాదంపై కూడా ఆమెతో చర్చించే అవకాశం ఉంది. ఇదే సమయంలో గోదావరి పుష్కరాలకు కేంద్ర సాయాన్ని కోరనున్నట్టు తెలుస్తోంది. ఉమాభారతితో భేటీ అనంతరం, ఈ మధ్యాహ్నం కేసీఆర్ హైదరాబాద్ తిరిగిరానున్నారు.

  • Loading...

More Telugu News