: టాలీవుడ్ నిర్మాత కామినేని కన్నుమూత


గతంలో పలు హిట్ చిత్రాలను నిర్మించిన సినీ సినీ నిర్మాత కామినేని ప్రసాద్‌ ఈ ఉదయం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని బంధువులు తెలిపారు. రాంకుమార్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ ను స్థాపించి అన్వేషణ, సూపర్‌ మొగుడు, ఇంటింటి రామాయణం వంటి విజయవంతమైన చిత్రాలను కామినేని నిర్మించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదముత్తేవికి తరలించారు. కామినేని ప్రసాద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News