: తెగేదాకా లాగొద్దు: ఆర్టీసీ కార్మికులకు చంద్రబాబు వార్నింగ్


తమ సమ్మెతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్న ఆర్టీసీ కార్మికులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. మీ చర్యలతో ఆర్టీసీ మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితిని తీసుకువచ్చారని కోప్పడ్డారు. ఏ విషయాన్నైనా చర్చలతో పరిష్కరించుకోవచ్చని, తెగేదాకా లాగొద్దని అన్న ఆయన, తక్షణం సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశామని వెల్లడించిన ఆయన ఉపసంఘం నివేదిక వచ్చే వరకూ వేచి చూడాలని కోరారు. సమ్మె కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఆర్టీసీ సమ్మె మూడవ రోజుకు చేరగా, పలు డిపోల ముందు కార్మికులు ధర్నాలు నిర్వహించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News