: సుప్రీంకోర్టు అక్కర్లేదన్నా, ట్రయల్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
ఓ పరువునష్టం దావా కేసులో మహారాష్ట్రలోని భీవండీ ట్రయల్ కోర్టుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ కేసు విచారణకు రాహుల్ హాజరుకానక్కర్లేదని నిన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత న్యాయ వ్యవస్థ విలువను మరింతగా పెంచాలని భావిస్తున్న రాహుల్ కోర్టుకు హాజరు కావాలనే నిర్ణయించుకున్నారు. తన కార్యాలయం పేరిట సామాజిక మాధ్యమ వెబ్ సైట్ ట్విట్టర్ లో ఖాతాను ప్రారంభించిన రాహుల్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త ఒకరు పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.