: హైదరాబాదులో భారీ చోరీ... ఎన్నారై డాక్టర్ ఇంటిలో బంగారం, వజ్రాలు అపహరణ


హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ లో గతరాత్రి భారీ చోరీ జరిగింది. ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఉదయ్ నగర్ లో వెలుగుచూసిన ఈ చోరీలో ఓ ఎన్నారై వైద్యుడికి చెందిన ఇంటి నుంచి దొంగలు విలువైన సొత్తును దోచుకెళ్లారు. రాత్రి నిశ్చింతగా నిద్రపోయిన ఎన్నారై డాక్టర్ తెల్లవారి లేచి చూడగానే ఇల్లు మొత్తం చెల్లాచెదురుగా ఉండటాన్ని గమనించి చోరీ జరిగిందని గుర్తించారు. ఇంటిలో ఉన్న విలువైన వస్తువులతో పాటు ఖరీదైన వజ్రాలు, బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వెనువెంటనే ఆయన ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చోరుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News