: బ్రిటన్ ప్రధానిగా మళ్లీ కామెరూనే... ఎగ్జిట్ పోల్స్ వెల్లడి
బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తిరిగి మళ్లీ ఆ పదవిని చేజిక్కించుకోనున్నారు. ఈ మేరకు నిన్న జరిగిన ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ డేవిడ్ కామెరూనే విజయం సాధిస్తారని స్పష్టం చేశాయి. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన తన ప్రత్యర్థి పార్టీ కంటే చాలా ముందున్నట్లు ఎగ్జిట్ ఫలితాలు అంచనా వేశాయి. బ్రిటన్ పార్లమెంట్ లోని మొత్తం 650 స్థానాలకు నిన్న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వీటిలో 316 స్థానాలను కామెరూన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ కేవలం 239 స్థానాలకే పరిమితమవుతుందట. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విషయం అక్షర సత్యం కానుందని కామెరూన్ కేబినెట్ లోని కీలక మంత్రి మైఖేల్ గోవ్ ధీమా వ్యక్తం చేశారు.