: ఏపీ రాజధాని కోసం మాస్టర్ డెవలపర్ ఎంపిక
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం మాస్టర్ డెవలపర్ ఎంపికకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మాస్టర్ డెవలపర్ ను ఎంపిక చేయనుంది. మాస్టర్ డెవలపర్ ఎంపికకు కార్యదర్శి కమిటీ నియామకానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కార్యదర్శుల కమిటీలో ఆర్థిక, ఇంధన, పరిశ్రమల శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి మాస్టర్ డెవలపర్ కమిటీ కన్వీనర్ గా వ్యవహరిస్తారు.