: భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి: ప్రవీణ్ తొగాడియా
భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తేనే ప్రజలకు రక్షణ ఉంటుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రవీణ్ భాయ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో తీవ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలని సూచించారు. మతమార్పిళ్లను తక్షణం నిలువరించాలని ఆయన డిమాండ్ చేశారు. జమ్మూ-కశ్మీర్ లో బయటికెళ్లిన హిందువులు సురక్షితంగా ఇళ్లు చేరే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. మతమార్పిడులు అడ్డుకునేందుకు ఆరు సూత్రాల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని ఆయన చెప్పారు. మతమార్పిళ్లు అడ్డుకోకుంటే భారతదేశం ముస్లిం దేశంగానో, క్రైస్తవ దేశంగానో మారిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.