: పైలట్ కు అనారోగ్యం...భయపడ్డ 200 మంది ప్రయాణికులు
పైలట్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో ప్రయాణికులు ప్రాణాలరచేతిలో పెట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి 200 మంది ప్రయాణికులతో బయల్దేరిన మలేసియా విమానంలో పైలట్ కు అనారోగ్యం సంభవించింది. దీంతో, కో-పైలట్ మల్హోత్రా ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఢిల్లీ విమానాశ్రయాధికారులు రన్ వేను ఖాళీ చేయించారు. విమానంలో ప్రయాణిస్తున్న మరో పైలట్ సహాయంతో కో-పైలట్ విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. పైలట్ ను ఆసుపత్రికి తరలించారు.