: 494 పరీక్షా కేంద్రాలు...2.54 లక్షల మంది విద్యార్థులు...ఎలా జరుగుతాయో!
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రేపు ఏపీ ఎంసెట్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో పరీక్షకు ఎలా హాజరుకావాలా అని విద్యార్థులు ఆందోళన చెందుతుండగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. కాగా, ఎంసెట్ నిర్వహణకు మొత్తం 494 కేంద్రాలను ఎంపిక చేశారు. పరీక్ష పర్యవేక్షణకు ఏపీలో 22, హైదరాబాదులో 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దూర ప్రాంతాల విద్యార్థులకు వసతి గృహాల్లో వసతి సౌకర్యం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, విద్యార్థులు అరగంట లేటుగా వచ్చినా పరీక్షకు అనుమతించాలని పలు పరీక్షా కేంద్రాలకు సూచనలు అందినట్టు సమాచారం.