: పోలవరంపై లోక్ సభలో కేంద్రం ప్రకటన
పోలవరం ప్రాజక్టుపై లోక్ సభలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రాజెక్టును అనుకున్న సమయంలో నిర్మించి తీరుతామని కేంద్ర మంత్రి ఉమాభారతి తెలిపారు. పోలవరాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నామని, జాతీయ హోదా ప్రకటించినప్పుడే ఐదేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పోలవరంతో 222 గ్రామాల్లోని లక్షా 88వేల మంది నిర్వాసితులవుతారని, ఆరు గ్రామాల్లోని 1730 మందికి పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. పోలవరం పనులు ప్రస్తుతం చాలా వేగంగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు.