: ఒకే కాన్పులో ఐదుగురు అమ్మాయిల జననం


దేశంలో తొలిసారిగా పంజాబ్ లోని ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు అమ్మాయిలకు జన్మనిచ్చింది. భటిండా సమీపంలోని భుచో పట్టణంలో కుల్దీప్ కౌర్ (32) అనే మహిళ ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. రైతు కుటుంబానికి చెందిన కుల్దీప్ కౌర్ కు ప్రసవం చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. కేవలం 5 గ్రాముల హిమోగ్లోబిన్ తో ప్రసవానికి వచ్చిన ఆమెకు స్కాన్ చేస్తే, అందులో నలుగురు పిల్లలే ఉన్నట్టు కనిపించారని, డెలివరీ టైంలో ఐదుగురు బయటపడ్డారని గైనకాలజిస్ట్ వెల్లడించారు. తల్లితోపాటు ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉండగా, మరో ఇద్దరి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలిపారు. కుల్దీప్ కౌర్ దంపతులకు ఇదివరకే ఇద్దరు కుమార్తెలు ఉన్నా, మరో ఐదుగురికి జన్మనివ్వడం విశేషం.

  • Loading...

More Telugu News