: సునీల్ నరైన్ కు ఊరట... తుది వార్నింగిచ్చి ఓకే చెప్పిన బీసీసీఐ
కోల్‌కత్తా నైట్ రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ విషయంలో ఊరట లభించింది. మరోసారి అనుమానం రాకుండా ఉండేలా చూసుకోవాలని ఫైనల్ వార్నింగ్ ఇస్తూ, ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ ను ఉంచింది. బీసీసీఐ నిషేధం తర్వాత చెన్నైలోని శ్రీరామచంద్ర ఆర్ధోస్కోపి కేంద్రంలో బౌలింగ్ పరీక్షకు సునీల్ నరేన్ హాజరయ్యాడు. ఆయన బౌలింగ్ సరిగానే ఉందని ప్రాథమికంగా తేలడంతో అన్ని రకాల బాల్స్ వేసేందుకు, ఐపీఎల్ లో మిగిలిన అన్ని మ్యాచ్ లలో ఆడేందుకు అనుమతినిచ్చింది.