: సాల్మన్ దీవుల్లో భూకంపం... ప్రమాదకర స్థాయిలో అలలు ఎగసిపడే అవకాశం
ప్రపంచంలోని పలు ప్రాంతాలను భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా, సుందరమైన సాల్మన్ దీవుల్లో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమి లోపల 22 కిలోమీటర్ల లోతులో ఉందని అమెరికా జియాలజికల్ సర్వే సంస్థ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదయింది. అయితే, ఈ భూకంపం వల్ల సునామీ సంభవించే అవకాశం లేదని... కాకపోతే, ప్రమాదకర స్థాయిలో అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.