: మియాపూర్ నుంచి కూకట్ పల్లికి పరిగెత్తిన మెట్రో... కేరింతలు కొట్టిన ప్రజలు
ఈ మధ్యాహ్నం మియాపూర్ మెట్రో డిపో నుంచి కూకట్ పల్లి వరకూ మెట్రో రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. మియాపూర్ నుంచి బయలుదేరిన మెట్రో రైలు జేఎన్టీయూ, హౌసింగ్ బోర్డ్ ల మీదుగా కూకట్ పల్లి వరకూ వచ్చి అక్కడి నుంచి వెనక్కుతిరిగి వెళ్లింది. మెట్రో రైలును చూస్తున్న ప్రజలు చేతులు ఊపుతూ స్వాగతం పలికారు. కేరింతలు కొట్టారు. ఈ మార్గంలో ఇప్పటికే పట్టాలు, విద్యుత్ లైన్ల నిర్మాణం పూర్తయిన సంగతి తెలిసిందే. కొన్ని స్టేషన్ల నిర్మాణం, మెట్లు, ఎస్కలేటర్ల ఏర్పాటు వంటి పనులు పూర్తి కావాల్సి వుంది. తదుపరి దశలో అమీర్ పేట వరకూ లైన్ ను పూర్తి చేసి ట్రయల్స్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా అధికారులు వివరించారు.