: మనస్ఫూర్తిగా ఏడవాలంటే ఆ హోటల్ కు వెళ్లాల్సిందే!


మనస్ఫూర్తిగా ఏడవాలని, గట్టిగా రోదించాలని బాధపడేవారి కోసం జపాన్ లో ఓ వినూత్న హోటల్ ముస్తాబైంది. ఇక్కడ ఎంపిక చేసిన కొన్ని గదుల్లోకి వెళ్తే ఏడుపు దానంతట అదే తన్నుకు వస్తుందట. టోక్యోలోని మిత్సుయ్ గార్డెన్ యోత్సుయా అనే పేరున్న హోటల్ లో మహిళల కోసం, అందునా ఏడ్చేవారి కోసం 'క్రయ్యింగ్ రూమ్స్' సిద్ధం చేశారు. ఈ రూముల్లో కన్నీరు పెట్టించే విషాద చిత్రాలు, పెల్లుబికిన కన్నీటిని తుడుచుకునేందుకు లగ్జరీ టిష్యూలు తదితర సౌకర్యాలు కల్పిస్తారట. ఈ గదుల్లో ఉండేందుకు ఒక రోజు చార్జీ 83 డాలర్లు (సుమారు రూ. 5,300). ఇక్కడ ఆఫర్ చేసే చిత్రాల్లో ఫారెస్ట్ గంప్, ఏ టేల్ ఆఫ్ మారీ, త్రీ పప్పీస్ (2004 జపాన్ భూకంపంలో తన మూడు కూనలనూ రక్షించుకున్న ఓ శునకం కథ) తదితరాలుంటాయట. ఇంకా, విషాద పుస్తకాలు కూడా ఉంటాయి. మహిళలు కడుపారా ఏడ్చేందుకు అడ్డొచ్చే మేకప్ ను చెరిపేసుకునేందుకు మేకప్ రిమూవర్ వంటి సదుపాయాలు ఇక్కడి ప్రత్యేకత. అదీ సంగతి. సో... ఎవరైనా ఏడవాలని అనుకుంటే సరదాగా ఈ హోటలుకు వెళ్లొచ్చు!

  • Loading...

More Telugu News