: లఖ్వీకి జామీను ఇచ్చిన వారెవరో చెప్పండి... పాక్ కు లేఖ రాయనున్న భారత్
లష్కరే తోయిబా చీఫ్, ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి బెయిల్ మంజూరు చేసిన వైనంపై పాకిస్థాన్ ను భారత్ వివరణ కోరనుంది. ముంబై దాడుల అనంతరం భారత్ ఫిర్యాదుతో లఖ్వీని అరెస్ట్ చేసిన పాక్, ఆ తర్వాత దర్యాప్తులో వేగం లేదనే కారణం చెప్పి ఇటీవలే విడుదల చేసింది. విడుదల సమయంలో లఖ్వీ రెండు జామీనులను కోర్టుకు సమర్పించాడు. అది కూడా ఒక్కో జామీను విలువ రూ.10 లక్షలట. ఈ జామీనులు ఇచ్చిన వారెవరో తెలపాలని భారత్, పాక్ ను కోరనుంది. ఈ మేరకు త్వరలో పాక్ కు ఓ లేఖ రాయనున్నట్లు భారత విదేశాంగ శాఖ వర్గాలు చెబుతున్నాయి. లఖ్వీకి బెయిల్ మంజూరు, జామీను ఏర్పాటు తదితరాలను పాక్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏర్పాటు చేసి ఉంటుందని భారత్ అనుమానిస్తోంది.