: ఎండ వేడి నుంచి ఉపశమనం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మండే ఎండ నుంచి కాస్తంత ఉపశమనం లభించింది. తూర్పున ఉన్న బంగాళాఖాతం మీదుగా పడమర వైపునకు గాలులు వీస్తుండడంతో నిన్న మొన్నటితో పోలిస్తే రెండు నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు హైదరాబాదులో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, విజయవాడ, తునిలో 37, కావలి, నరసాపురం, విశాఖపట్నం, తిరుపతి 36, రెంటచింతలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మూడు రోజుల క్రితం 42 డిగ్రీలను దాటిన వేడి ఒక్కసారిగా తగ్గడంతో ప్రజలు కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్నారు. గతవారంతో పోలిస్తే విద్యుత్ వాడకం సైతం 5 శాతం వరకూ తగ్గిందని అధికారులు వివరించారు.