: మరోసారి కంపించిన న్యూగినియా... 7.0 తీవ్రతతో భూకంపం


భూగోళాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే నేపాల్ ను నేలమట్టం చేయడంతో పాటు భారత్, పాకిస్థాన్ లలో జనాన్ని పరుగులు పెట్టించిన భూకంపాలు, ఈ నెల 1న పపువా న్యూగినియాను భారీ కుదుపు కుదిపాయి. మొన్న 7.5 తీవ్రతతో కూడిన భూకంపం న్యూగినియాను భయభ్రాంతులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం ధాటికి దేశంలో నష్టమేమీ జరగకున్నా, సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజాగా కొద్దిసేపటి క్రితం న్యూగినియాలో మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 7.0 గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా కూడా అక్కడ పెద్ద నష్టమేమీ జరగలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News