: కర్ణాటక మాజీ సీఎంలు యడ్యూరప్ప, కుమారస్వామిపై కేసు నమోదు


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడ్యూరప్ప, హెచ్ డీ కుమారస్వామిలపై కేసు నమోదైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని అత్యంత ఖరీదైన ప్రాంతం ఆర్టీ నగర్ లో ఓ భూమి డీ-నోటిఫై వ్యవహారానికి సంబంధించిన వివాదంలో వీరిద్దరిపై నేటి ఉదయం బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కుమారస్వామి బంధువు రాజశేఖరయ్య అనే వ్యక్తికి బెంగళూరు డెవలప్ మెంట్ అథారిటీకి చెందిన సదరు భూమిని అప్పగించేందుకు ఇద్దరు సీఎంలు నడిపిన మంత్రాంగంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన లోకాయుక్త ఆదేశాల మేరకే ఈ కేసు నమోదైంది. కుమారస్వామి సీఎంగా ఉండగా మొదలైన సదరు భూమి డీ-నోటిఫై ప్రక్రియ ఆ తర్వాత యడ్యూరప్ప హయాంలో ముగిసింది. అంటే, యడ్యూరప్ప కూడా ఈ విషయంలో కుమారస్వామి బంధువుకు అనుకూలంగానే వ్యవహరించారని తెలుస్తోంది. ఇక సదరు భూమిని పొందిన రాజశేఖరయ్యపైనా పోలీసు కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News