: బుల్లెట్ దిగితే, ఏదో చిన్న రాయిలే అనుకున్న యువతి
ఆమె వెన్నులో బుల్లెట్ దిగింది. నొప్పిగా అనిపించినా, చిన్న రాయి తగిలిందిలే అనుకొంది. ఓ టీటీ చేయించుకుని వెళ్లిపోయింది. నొప్పి పెరుగుతూ ఉండడంతో ఆసుపత్రికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. అసలీ బుల్లెట్ ఎవరిది? ఎవరు కాల్చారో తేల్చే పనిలో పోలీసులు బిజీ అయిపోయారు. వివరాల్లోకి వెళితే, ఆమె పేరు సత్య. తన సోదరిని అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చే క్రమంలో విశాఖపట్నం జిల్లా మర్రిపాలెం రైల్వే స్టేషన్ కు చేరుకుంది. రైలు కోసం ఎదురుచూస్తూ, ప్లాట్ ఫాంపై కూర్చున్న సత్య వీపుపై బుల్లెట్ తగిలింది. దీన్ని ఆమె అంతగా పట్టించుకోలేదు. ఆపై ఆసుపత్రిలో చేరగా, ఎక్స్ రే తీసిన వైద్యులు లోపల బుల్లెట్ ఉన్న విషయాన్ని వెల్లడించారు. శస్త్రచికిత్స చేసి దాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.