: క్షణికావేశంలో చెల్లెలిని గొడ్డలితో నరికిన అన్న


ఎంతో ప్రేమతో చూసుకున్న చెల్లెలినే క్షణికావేశంలో హత్య చేశాడో అన్న. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో ఈ ఉదయం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీగా జీవనం కొనసాగిస్తున్న రాజలింగం (28) తన సోదరి లత (20)తో ఈ ఉదయం గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన రాజలింగం నియంత్రణ కోల్పోయి, లతను గొడ్డలితో నరికేశాడు. దీంతో, లత అక్కడికక్కడే మరణించింది. రాజలింగం సోదరుడు దుబాయ్ లో ఉంటుండగా, వీరికి ఐదుగురు అక్కా చెళ్లెళ్లు ఉన్నారు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే మరణించారు. అప్పట్నుంచి అన్నదమ్ములిద్దరూ తమ సోదరిలను అన్యోన్యంగా చూసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జరిగిన హత్య స్థానికులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News