: పరువు నష్టం కేసులో రాహుల్ కు ఊరట
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. ఈ కేసులో స్టే ఇస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను సుప్రీం జులై 8కి వాయిదా వేసింది. గతేడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఓ ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్సే చంపిందంటూ వ్యాఖ్యానించారు. దాంతో ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంటే రాహుల్ పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆ తరువాత తనపై ఉన్న ఈ కేసును కొట్టివేయాలంటూ గతంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బాంబే హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది.