: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి నమిత
సినీ నటి నమిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమెను చూసేందుకు భక్తులు గుమిగూడారు. మరోవైపు వీహెచ్ పీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. బెంగళూరుకు చెందిన కొంతమంది భక్తులు శ్రీవారి అన్నప్రసాద కార్యక్రమానికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ తక్కువగా ఉంది.