: ఏపీకి ప్రత్యేక హోదా కోసం మాజీ మంత్రి నిరాహార దీక్ష


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేసేందుకు ఒకరి తరువాత ఒకరు ముందుకొస్తున్నారు. సినీ నటుడు శివాజీ నిన్నటి వరకు దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఒకరోజు దీక్ష చేపట్టారు. కృష్ణా జిల్లాలోని నందిగామలో గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు దీక్షకు పూనుకున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ దీక్షలో అన్ని పక్షాల నేతలు, కార్యకర్తలు, నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నెగంటి జీవరత్నం పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News