: పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్... వధూవరులు సహా 30 మందికి అస్వస్థత
తుళ్లింతలు, కేరింతల మధ్య కొనసాగిన ఓ వివాహ వేడుకలో ఉన్నట్టుండి గందరగోళం నెలకొంది. వివాహ మహోత్సవంలో సుష్టుగా భోజనం చేసిన వారు అస్వస్థతకు గురయ్యారు. వారితో పాటు కొత్త జీవితం ప్రారంభించాల్సిన వధూవరులు కూడా ఆస్పత్రికి పరుగులు పెట్టారు. హైదరాబాదులోని సతన్ నగర్ పరిధిలోని ఫతేనగర్ లో నిన్న రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహంలో భాగంగా ఏర్పాటు చేసిన విందును ఆరగించిన వధూవరులు సహా, 30 మంది అస్వస్థతకు గురయ్యారు. విషయాన్ని సకాలంలో గుర్తించిన బంధువులు అస్వస్థతకు గురైన వారిని హుటాహుటీన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.