: నాకంత టైమ్ లేదంటున్న యువరాజ్ సింగ్


కోల్పోయిన ఫామ్ ను తిరిగి పొందేందుకు నానా కష్టాలు పడి, ఐపీఎల్ రెండో అర్ధభాగంలో సత్తా చాటుతున్న యువరాజ్ సింగ్, తనపై వస్తున్న విమర్శలను పట్టించుకునేంత సమయం లేదంటున్నాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 బంతుల్లో 57 పరుగులతో యువరాజ్ రాణించినప్పటికీ, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు విజయం సాధించడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ, వర్షం తమ విజయావకాశాలపై ప్రభావం చూపిందని అన్నాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాటుతోనే సమాధానం చెబుతాతప్ప వాటిని గురించి ఆలోచించేంత సమయం కేటాయించలేనని వివరించాడు.

  • Loading...

More Telugu News