: రేపే ఏపీ ఎంసెట్... ఆర్టీసీ సమ్మెతో విద్యార్థుల అగచాట్లు


ఏపీలో ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్ పరీక్ష రేపు జరగనుంది. మొత్తం 407 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. నిన్నటి నుంచి ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎంసెట్ అభ్యర్థులను అయోమయంలోకి నెట్టింది. దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షకు హాజరయ్యేందుకు మారుమూలల్లోని గ్రామీణ విద్యార్థులతో పాటు పట్టణ ప్రాంత విద్యార్థులకు కూడా ఆర్టీసీ బస్సులే దిక్కు. అయితే, కార్మికుల సమ్మె కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇప్పటికే అన్ని విధాలుగా సిద్ధమైన విద్యార్థులు రేపటి పరీక్షకు హాజరయ్యేందుకు నేటి నుంచే రోడ్లమీదకు వచ్చేశారు. అందిన వాహనాన్ని పట్టుకుని పరీక్షా కేంద్రాల సమీపానికి చేరుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

  • Loading...

More Telugu News