: హైదరాబాద్ లో 3 లక్షల మొక్కలు నాటుతాం: కేసీఆర్


తెలంగాణను హరితహారంగా మార్చే కార్యక్రమం జూన్ నెలలో ప్రారంభిస్తామని టీఎస్ సీఎం కేసీఆర్ తెలిపారు. ఒక్క హైదరాబాద్ లోనే 3 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎవరి ఇంటి వద్ద వారు మొక్కలు నాటుకోవాలని చెప్పారు. ఇంటి దగ్గర విశాలమైన స్థలం ఉంటే రెండు, మూడు మొక్కలు నాటుకోవాలని సూచించారు. హైదరాబాద్ క్లీన్ సిటీగా మారితే అంతర్జాతీయంగా ఖ్యాతి కూడా పెరుగుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News