: సల్మాన్ కు శిక్ష పడడంతో తిండి మానేసిన అవిభక్త కవలలు
తమ అభిమాన హీరో సల్మాన్ ఖాన్ కు హిట్ అండ్ రన్ కేసులో జైలు శిక్ష పడడంతో వారు తీవ్రంగా కలతచెందారు. తిండి మానేశారు. బీహార్ రాజధాని పాట్నాలోని సమన్ పూర్ లో నివాసముండే ఫరా, సబాలది ఓ విషాదగాథ. వారిద్దరూ అవిభక్త కవలలు. 18 ఏళ్లుగా వారిద్దరూ అలాగే బతుకీడుస్తున్నారు. కాగా, సల్మాన్ కు ఐదేళ్ల శిక్ష పడిందన్న వార్తతో ఫరా, సబా దిగ్భ్రాంతి చెందారని ఆ కవలల తండ్రి షకీల్ అహ్మద్ తెలిపారు. దీంతో, వారిద్దరూ తిండి మానేసి సల్మాన్ కు సంఘీభావం ప్రకటించారు. మూడేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ ఈ కవలలను స్వంత ఖర్చులతో ముంబై రప్పించి రాఖీ కట్టించుకున్నాడు. ఆ రాఖీ అన్నయ్య కోసం ఫరా, సబా దేవుడిని ప్రార్థిస్తున్నారని వారి తండ్రి అహ్మద్ పేర్కొన్నారు.