: హైదరాబాదులో పలు ప్రాంతాల్లో వర్షం


మండుటెండలతో ఉడికిపోతున్న హైదరాబాదు నగరం కొంత చల్లబడింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించింది. చంపాపేట్, కర్మన్ ఘాట్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. కొన్ని చోట్ల హోర్డింగ్ లు నేలమట్టమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

  • Loading...

More Telugu News