: స్టాక్ మార్కెట్లో 'బ్లడ్ బాత్'!
భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు చుక్కలు చూపింది. ఒక్క రోజులో 2.5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద హరించి వేసింది. అంతర్జాతీయ మార్కెట్ల పతనం ప్రభావం చూపడంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ ఫండ్ సంస్థలు భారీఎత్తున ఈక్విటీల విక్రయానికి దిగడంతో మార్కెట్లో 'బ్లడ్ బాత్' నమోదైంది. బుధవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 722.77 పాయింట్లు పడిపోయి 2.63 శాతం నష్టంతో 26,717.37 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 227.80 పాయింట్లు పడిపోయి 2.74 శాతం నష్టంతో 8,097.00 పాయింట్ల వద్ద కొనసాగింది. మిడ్, స్మాల్ క్యాప్ లు మూడు శాతానికి పైగా దిగజారాయి. నిఫ్టీ-50లో ఒక్క భారతీ ఎయిర్ టెల్ మినహా అన్ని కంపెనీలూ నష్టపోయాయి.