: ప్రపంచ శృంగార పురుషులు, స్త్రీల జాబితాలో భారత్ కు దక్కని స్థానం


ప్రపంచ వ్యాప్తంగా శృంగార పురుషులు, స్త్రీల జాబితాలో ఇండియాకు స్థానం దక్కలేదు. ప్రముఖ ట్రావెల్ మ్యాగజైన్ 'మిస్ ట్రావెల్' చేపట్టిన సర్వే అనంతరం వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచంలో సెక్సీయస్ట్ మహిళలు ఆర్మేనియన్లని, ఐరిష్ పురుషులు శృంగార కాముకులని వెల్లడించింది. వరల్డ్ వైడ్ గా ట్రావెల్ చేసే 1.10 లక్షల మందిని ప్రశ్నించి తయారు చేసిన జాబితాలో శృంగార మహిళల్లో రెండవ స్థానంలో బజాన్ మహిళలు నిలువగా, ఆపై వరుసగా అమెరికన్, కొలంబియన్, ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్, బ్రెజిలియన్, ఫిలిప్పీన్స్, బల్గేరియన్, లెబనీస్ మహిళలు టాప్-10లో నిలిచారు. ఇదే సమయంలో శృంగార పురుషుల జాబితాలో రెండవ స్థానంలో ఆస్ట్రేలియన్లు, ఆపై పాకిస్థానీలు, అమెరికన్ల, బ్రిటీషర్లు, స్కాటిష్ లు, ఇటాలియన్లు, నైజీరియన్లు, డానిష్ లు, స్పానియన్లు నిలిచారు.

  • Loading...

More Telugu News