: ఏపీ, తెలంగాణలో ఈ నెల 16, 18న టీడీపీ జిల్లా కమిటీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ జిల్లా కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కర్నూలు, చిత్తూరులోను; తెలంగాణలోని కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, మంచిర్యాలలోను టీడీపీ జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహిస్తారు. 18న ఏపీలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, కడప, అనంతపురం; తెలంగాణలోని మెదక్, వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలోను టీడీపీ జిల్లా కమిటీ ఎన్నికలు జరుగుతాయి.