: చైనా భాషలో మోదీ ట్వీట్లు!
వచ్చే వారంలో చైనాలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అందుకు తనదైన సన్నాహాలు ప్రారంభించారు. ఎలాగైనా చైనీయులను ఆకట్టుకోవాలనుకుంటున్న ఆయన తనదైన శైలిలో, చైనా భాషలో ట్వీట్లు పెట్టడం ప్రారంభించారు. రెండు దేశాల మధ్యా స్నేహ సంబంధాలు మెరుగు పడడానికి ఇదే సరైన తరుణమని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల చైనా ట్విట్టర్ 'వైబో' ఖాతాను ప్రారంభించిన ఆయన చైనీస్ భాషలో తన అభిప్రాయాలను వెలిబుచ్చడం ద్వారా ఆ దేశ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఈనెల 14 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న చైనా పర్యటనలో భాగంగా మోదీ బీజింగ్, షాంగై నగరాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.