: బాబు బహిరంగ సభలో రైతు ఆత్మహత్యాయత్నం


నీరు - చెట్టు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా నర్సీపురంలో జరిగిన బహిరంగ సభలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభలో ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరగడంతో అధికారులను పరుగులు పెట్టించింది. ముందుగానే పురుగుల మందుతో అక్కడికి వచ్చిన సీతాఫల్ మండలం, చిన్న భోగిలి గ్రామ రైతు రాము ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండల వీఆర్ ఓ వేధింపుల వల్లే రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, సమయానికి 108 వాహనం అక్కడ లేకపోవడంతో అందుబాటులో ఉన్న ఆటోలో రామును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News