: బాంబే హైకోర్టులో సల్మాన్ బెయిల్ పిటిషన్... కాసేపట్లో విచారణ


తనకు పడ్డ ఐదేళ్ల శిక్షపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సల్మాన్ తరపున ఆయన సోదరులు, న్యాయవాదులు కలిసి నేటి మధ్యాహ్నం 3 గంటల సమయంలో పిటిషన్ దాఖలు చేశారు. సెషన్స్ కోర్టు తీర్పును నిలిపివేయాలని, తమ క్లయింటుకు వెంటనే బెయిలివ్వాలని వారు పిటిషన్ లో కోరారు. దీనిపై కోర్టు మరికాసేపట్లో విచారణ ప్రారంభించనుంది. కోర్టు బెయిలును మంజూరు చేసిన పక్షంలో సాయంత్రం 5 గంటల్లోగా న్యాయమూర్తి ఆదేశాలు ఆర్థర్ రోడ్డు జైలుకు చేరితేనే సల్మాన్ బయటకు వస్తాడు. లేకుంటే ఈ రాత్రి ఆయన జైలు గోడల మధ్య ఉండాల్సిందే. కాగా, మరో మూడు రోజుల్లో హైకోర్టుకు వేసవి సెలవులు మొదలుకానున్న నేపథ్యంలో ఈలోగా బెయిల్ వస్తుందని సల్మాన్ న్యాయవాదులు గట్టిగా విశ్వసిస్తున్నారు.

  • Loading...

More Telugu News