: 'రా' ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది: పాక్ సైన్యం ఆరోపణ
పాకిస్థాన్ సైన్యం భారత్ పై ఆరోపణలు చేస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది భారతేనని అంటోంది. భారత్ కు చెందిన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) పాక్ లో టెర్రరిజం వ్యాప్తికి పాటుపడుతోందని ఆరోపించింది. రావల్పిండి నగరంలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో పాక్ సైన్యానికి చెందిన టాప్ కమాండర్లు సమావేశమయ్యారు. అనంతరం, ఆర్మీ ప్రకటన చేసింది. దేశంలో ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా 'రా' చర్యలు ఉంటున్నాయని పేర్కొంది. పాక్ సైన్యం భారత్ పై అధికారికంగా ఆరోపణలకు దిగడం చాలా అరుదని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.