: సల్మాన్ కు గుండె జబ్బా?
హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు ముంబై సెషన్స్ కోర్టు ఐదేళ్ల శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వాదనల సందర్భంగా, సల్మాన్ కు గుండె జబ్బు ఉందని ఆయన తరపు లాయర్లు కోర్టుకు విన్నవించారు. డాక్టర్లు ఇచ్చిన నివేదికను కూడా వారు జడ్జ్ కు సమర్పించారు. దాన్ని పరిగణనలోకి తీసుకుని మూడేళ్ల లోపు శిక్ష ఖరారు చేయాలని కోరారు. అయినాగానీ, జడ్జ్ సల్మాన్ కు ఐదేళ్ల శిక్ష ఖరారు చేశారు.