: తప్పుడు సాక్ష్యం చెప్పిన సల్మాన్ డ్రైవర్ పై కేసు నమోదు


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు కాస్త కఠినంగానే వ్యవహరించింది. శిక్ష తగ్గించమన్న సల్మాన్ వాదనను తోసిపుచ్చి ఐదేళ్ల శిక్షను విధించిన న్యాయమూర్తి, ఈ కేసులో తప్పుడు సాక్ష్యాలపైనా చర్యలకు ఉపక్రమించారు. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ కారు నడపలేదని, తానే కారును నడిపానంటూ కోర్టు ముందుకు వచ్చిన సల్మాన్ కారు డ్రైవర్ పై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్ తప్పుడు సాక్ష్యం చెప్పాడని నిర్ధారించుకున్న కోర్టు, అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులకు సూచించింది. 13 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఈ కేసు విచారణ చివరి దశలో ప్రత్యక్షమైన సల్మాన్ డ్రైవర్ అబద్ధపు సాక్ష్యం చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించాడని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News