: పిచ్చిపిచ్చిగా మాట్లాడితే షబ్బీర్ ను పిచ్చాసుపత్రికి పంపాల్సి ఉంటుంది: టీఆర్ఎస్
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించడాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు ఖండించారు. కేసీఆర్ ను విమర్శించే అర్హత షబ్బీర్ కు లేదని... ఆయనో చెల్లని రూపాయిలాంటి వాడని అన్నారు. కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా తెలంగాణ కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపేందుకు కేసీఆర్ చేస్తున్న కృషిని చూసి ఓర్వలేకే షబ్బీర్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే షబ్బీర్ ను పిచ్చాసుపత్రికి పంపాల్సి ఉంటుందని... చిల్లర విమర్శలు మానుకోవాలని రాజేశ్వర్ రావు సూచించారు.