: పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఆంధ్ర మేధావుల సంఘం నేతలు...‘హోదా’ నినాదాల ఎఫెక్ట్!


ఏపీకి ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన ఆంధ్ర మేధావుల సంఘం నేతలు ఢిల్లీలో అరెస్టయ్యారు. నేటి ఉదయం మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ నేతృత్వంలో సంఘం సభ్యులు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఏపీకి చెందిన పార్లమెంట్ సభ్యులను కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంపీలకు చెప్పారు. ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణలోనే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో వారిని నియంత్రించిన పోలీసులు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం చలసాని శ్రీనివాస్ సహా ఆంధ్ర మేధావుల సంఘం నేతలు స్టేషన్ లోనే ఉన్నారు.

  • Loading...

More Telugu News