: ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చల్లేవ్...విధులకు రాకుంటే చర్యలు తప్పవు: ఏపీ మంత్రి శిద్ధా


ఆర్టీసీ సమ్మెను ఏపీ సర్కారు సీరియస్ గా పరిగణించింది. సమ్మెకు స్వస్తి చెప్పి విధులకు హాజరుకావాలని కార్మికులకు ఆదేశాలు జారీ చేసింది. సమ్మెను ముగించే దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టదని ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తేల్చిచెప్పారు. సమ్మెను నివారించేందుకు ఇప్పటికే అందుబాటులోని అన్ని మార్గాలను పరిశీలించామని, కార్మికులు మొండి వైఖరితో సమ్మెకు వెళ్లారని ఆయన ఆరోపించారు. సమ్మెలో పాల్గొంటున్న కాంట్రాక్టు సిబ్బంది తక్షణమే విధులకు హాజరు కావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. విధులకు హాజరుకాని కాంట్రాక్టు కార్మికులను సర్వీసు నుంచి తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. అంతేకాక సమ్మెను విరమింపజేసే దిశగా కార్మిక సంఘాలతో చర్చల ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News