: ఇరకాటంలో మోదీ ప్రభుత్వం... సొంత మనుషుల నుంచే వ్యతిరేకత
జరుగుతున్న పరిణామాలు నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేవే. భూసేకరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను విపక్షాలన్నీ ఎండగడుతున్న సంగతి తెలిసిందే. విపక్షాలను దీటుగా ఎదుర్కొంటున్న మోదీ సర్కారుకు ఇప్పుడు కొత్త సమస్య తలెత్తింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల్లో ఒకటైన స్వదేశీ జాగరణ్ మంచ్ కూడా ఈ సవరణలను వ్యతిరేకిస్తోంది. అంతేకాదు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు కూడా దిగుతోంది. ఒకవేళ భూసేకరణ బిల్లును ఆమోదిస్తే, దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని కూడా మంచ్ నేత గోవిందాచార్య హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజాప్రయోజనాలకు మంచిది కాదని ఆయన అన్నారు. సొంత సంస్థ నుంచే వ్యతిరేకత వస్తుండటంతో మోదీ సర్కారు ఇరకాటంలో పడినట్టైంది.