: కుటుంబ సభ్యులతో కలసి కోర్టుకు వెళ్లిన సల్మాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులతో కలసి ముంబయిలోని సెషన్స్ కోర్టుకు వెళ్లాడు. హిట్ అండ్ రన్ కేసులో 11.15 గంటలకు కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్ పాండే తుదితీర్పును వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసులో సల్మాన్ పై నేరం రుజువైతే దాదాపు పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు కోర్టు తీర్పుపై బాలీవుడ్ ప్రముఖులు, సల్మాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.