: గాయాన్ని దాచి చిక్కుల్లో పడ్డ బాక్సింగ్ యోధుడు పకియావ్!


మూడు రోజుల క్రితం మహాబలుడు మేవెదర్ చేతిలో ఓటమిని చవిచూసిన ఫిలిప్పీన్స్ వీరుడు పకియావ్ కు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. పకియావ్ తన భుజం గాయాన్ని దాచి పోటీలో పాల్గొన్నాడన్న అభియోగాలు వినిపిస్తున్నాయి. దీంతో పూర్తి ఆరోగ్యంగా లేకున్నప్పటికీ, బరిలోకి దిగడం వల్ల తాము వినోదాన్ని కోల్పోయామని ఆరోపిస్తూ, ప్రేక్షకులు నష్టపరిహారం కోసం కోర్టుకు వెళ్లే ప్రమాదం ఉన్నట్టు క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. పోరుకు ముందు పకియావ్ తనకు భుజం గాయం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో అసత్య ప్రమాణం చేశాడన్న ఆరోపణపై నెవడా స్టేట్ అథ్లెటిక్ కమిషన్ అతనిపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం. ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న పకియావ్ ఇప్పుడు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో!

  • Loading...

More Telugu News