: నాలుగో రోజుకు చేరిన ఆమరణ దీక్ష... ‘హోదా’ వచ్చే దాకా ఆపేది లేదంటున్న శివాజీ
ఏపీకి ప్రత్యేక హోదా కోసం సినీ నటుడు, బీజేపీ నేత శివాజీ గుంటూరులో చేపట్టిన దీక్ష నేటికి నాలుగో రోజుకు చేరింది. ఈ క్రమంలో ఆయన బాగా నీరసించిపోయారు. దీక్ష విరమించాలని ఇప్పటికే పలుమార్లు పోలీసులు చేసిన వినతిని శివాజీ తిరస్కరించారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదాకా దీక్ష విరమించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఆరోగ్యం క్షిణించినా, దీక్ష విరమించబోనని ఆయన ప్రకటించారు. నిన్న నిర్వహించిన వైద్య పరీక్షల్లో శివాజీ బాగా నీరసించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే, అటు కేంద్రం నుంచి కాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ శివాజీ దీక్షపై ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో నేడో, రేపో శివాజీని బలవంతంగానైనా దీక్ష విరమింపజేసే ప్రయత్రాలు జరగొచ్చనే వాదన వినిపిస్తోంది.