: శివాజీని ఫోన్ లో పరామర్శించిన రాజేంద్రప్రసాద్
గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న సినీ నటుడు శివాజీని తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఫోన్ లో పరామర్శించారు. శివాజీ ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా శివాజీ ఆయనతో మాట్లాడుతూ, ప్రత్యేకహోదా రాని పక్షంలో ఆంధ్రప్రదేశ్ బీహార్ లా మారే ప్రమాదం ఉందని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన వ్యక్తిగా మాతృ భూమి రుణం తీర్చుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పాడు. దీంతో శివాజీని రాజేంద్ర ప్రసాద్ అభినందించాడు. రాష్ట్ర ప్రజల్లో స్పూర్తి రగిలిస్తున్నట్టు చెప్పారు.