: టీమిండియా కోచ్ ఆఫర్ తిరస్కరించిన పాక్ దిగ్గజ ఆటగాడు


టీమిండియా కోచ్ గా బాధ్యతలు వహించేందుకు మాజీ క్రికెటర్లు, కోచ్ లు ఆసక్తి చూపుతారు. అలాంటిది టీమిండియా కోచ్ అవతారమెత్తేందుకు పాకిస్థాన్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ అనాసక్తి కనబరచడం విశేషం. టీమిండియా మాజీ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్, కోచ్ గా పనిచేయాలంటూ అక్రమ్ కు ఆఫర్ ఇచ్చాడు. దానిని అక్రమ్ మర్యాద పూర్వంగా తిరస్కరించాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కోచ్ గా విధులు నిర్వర్తిస్తున్న వసీం అక్రమ్ మాట్లాడుతూ, 'నేను టీమిండియాకు ఫుల్ టైమ్ కోచ్ గా అందుబాటులో ఉండలేను. నాకున్న వాణిజ్యపరమైన, కుటుంబపరమైన లావాదేవీలతో ఫుల్ టైమ్ కోచ్ గా ఉండటం కష్టం' అని స్పష్టం చేశాడు. టీమిండియాకు ఉపఖండంలోని కోచ్ అయితే బాగుంటుందని, అందుకే అక్రమ్ పేరు తెరమీదికి తీసుకొచ్చినట్టు వెంగ్ సర్కార్ తెలిపాడు.

  • Loading...

More Telugu News