: 137 మందితో సముద్రంలో మునకేసిన పడవ
137 మంది ప్రయాణికులతో వస్తున్న పడవ ఇటలీలోని సిసిలీ సమీపంలోని మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో డజన్ల సంఖ్యలో వలసదారులు మృతి చెంది ఉండవచ్చని అక్కడి అధికారులు భావిస్తున్నారు. పడవ ప్రమాదం గురించి తెలియగానే రెస్క్యూ బోట్లు అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. కాగా, కొద్ది రోజుల క్రితం వలసదారులతో వస్తున్న ఓ పడవ ఇదే సముద్రంలో మునిగి 700 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.